NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ వీరేశ్వర స్వామి సన్నిధిలో.. ఏలూరు కలెక్టర్

1 min read

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో యం.ఎస్. శర్మ

పల్లెవెలుగు వెబ్​, పోలవరం: పట్టిసీమలోని శ్రీ భద్రకాళీసమేత శ్రీవీరేశ్వరస్వామిని శనివారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం   పోలవరం మండలం పట్టిసీమలోని శ్రీ భద్రకాళీసమేత శ్రీవీరేశ్వరస్వామి ఆలయానికి  విచ్చేసిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్ దంపతులను ఆలయ ఈ ఓ, ఆలయ  అర్చకులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దుశ్శాలువాతో కలెక్టర్ ను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు.  క్యూ లైన్లలో ఎక్కువసేపు భక్తులు వేచి ఉండకుండా, త్వరితగతిన దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ ఝాన్సీరాణి, ఆలయధర్మకర్త మండలి చైర్మన్ వీరభద్రరావు, దేవాదాయశాఖ డిప్యూటీ కమీషనర్ ఆర్. విజయరాజు, డిఎస్పీ లతకుమారి, ఆలయ ఈఓ ఎం.ఎస్. శర్మ, ఎంపిపి ఎస్. వెంకటరెడ్డి, సర్పంచ్ శ్రీరామమూర్తి, తహసీల్దార్ సుమతి, ఎంపిడిఓ శ్రీనివాసబాబు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author