NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ముఖ్యమంత్రి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మార్ డి బలరాం దంపతులు

1 min read

పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు

అభినందనలు తెలియజేసిన పలువురు నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి పచ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నల్లజర్ల ప్రియాంక కన్వీన్షన్ నందు నారా చంద్రబాబు నాయుడు  సమక్షంలో ఏలూరు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి),ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని విరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఆధ్వర్యంలో  ఏలూరు మాజీ ఈడ చైర్మన్ ఎమ్మార్డీ  ఈశ్వరి బలరాం, టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనకు శాలువా కప్పి సాదరంగా భార్యాభర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు నాయకులు ఎమ్మార్ డి బలరాం దంపతులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కoచన రామక్రిష్ణ,అద్దెపల్లి శ్రీను, జుజ్జువరపు ప్రతాప్, పిల్ల హరినారాయణ,రాళ్లపల్లి రవికుమార్,తాలూరి రామక్రిష్ణ, ఎస్.కె మస్తాన్ బి పాల్గొన్నారు.

About Author