PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద స్వామి సన్నిధిలో… గీతాజ్ఞాన యజ్ఞం..

1 min read

పల్లెవెలుగు వెబ్​:తిరుమల తిరుపతి దేవస్థానములు- హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు దేవదాయ ధర్మదాయ శాఖ సంయుక్త నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 18  భగవద్గీత జ్ఞానయజ్ఞం కేంద్రాలలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు శ్రీమద్భగవద్గీత జ్ఞాన యజ్ఞం  ఆలయ కార్యనిర్వహణాధికారి / అసిస్టెంట్ కమీషనర్ కె. వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం డిసెంబర్ 4వ తేదీ గీతా జయంతి వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఒక అధ్యాయం పారాయణం మరియు ఆ అధ్యాయంపై ప్రవచనం ఉంటుందని, శ్రీమద్భగవద్గీత సమస్త మానవాళిని దుఃఖం నుండి ఉపశమనం కలిగించటంతోపాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుందని తెలిపారు. భగవద్గీత ప్రవచకులు మాచాని నాగరాజు మొదటి రోజు అర్జున విషాద యోగంపై ఉపన్యసిస్తూ, గీత ఆవిర్భావము, భగవద్గీత అందించే సందేశాన్ని క్లుప్త సుందరంగా వివరించి అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధీక్షకులు కె.వేంకటేశ్వరరావు, మల్లిఖార్జున, ఆలయ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే. ధర్మ ప్రచార మండలి సభ్యులు న్యాయకంఠి భీమిరెడ్డి, వి.శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author