రెండవ డివిజన్ లో గడపగడపకు మన ప్రభుత్వం : పాల్గొన్న ఆళ్ల నాని
1 min read
– మన ప్రభుత్వానికి అండగా నిలవండి.. ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరంలో స్థానిక రెండవ డివిజన్ లో 82వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కార్పొరేటర్ జూలూరు నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని బావిశెట్టి వారి పేట శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా ఆళ్ల నానికి నిరాజనాలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేజర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, మేయర్లు సుధీర్, బాబు శ్రీనివాస్ , రెండవ డివిజన్ కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు, బోద్దాని శ్రీనివాస్, వైసిపి అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.