PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సేవలో.. రాజా విష్ణు వర్ధన్​ రెడ్డి…

1 min read

సీఎం జగన్​ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

• అనాథ పిల్లల, వృద్ధా ఆశ్రమాలలో అన్నదానాలకు ఆర్థిక సహాయం అందజేత

• తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు

• నగరంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు

•  తల్లిదండ్రులను కోల్పోయిన అనాధలను ఉచిత కార్పొరేట్ విద్య

• కర్నూలులో 2024లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయటమే లక్ష్యం

• కర్నూలు నగరంలో దూసుకెళుతున్న రాజా విష్ణు యూత్

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జనం మెచ్చిన నేత ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్న జనం అందరి గుండెల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాజా విష్ణు యూత్ ఆధ్వర్యంలో పాస్టర్లకు, మదరస్సాలో పని చేసే ముస్లింలకు, బ్రహ్మణులకు, వికలాంగులకు వస్త్రాలను, హెచ్ఐవి బాధితులకు న్యూట్రీషియన్ ఫుడ్ పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు బివై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే జె సుధాకర్, మతపెద్దలు ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకత్వం అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమని, అది ఒక్క జగన్ కే సాధ్యమని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుగులేని నాయకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిన సంక్షేమ సామ్రాట్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాంటి మహా నాయకుడు జన్మదినం సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. రాజా విష్ణు వర్ధన్ రెడ్డి గారు జగనన్న స్పూర్తితో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మమ్మలిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి భాగస్వాములు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.  అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పి రాజా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరీ ఆశీర్వాదాలతో మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న లెజెండరీ లీడర్ జగనన్న. జగనన్నను 2024లో ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మా యూత్ కృషీ చేస్తుందని, కర్నూలులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగుర వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిసి విభాగం రాష్ట్ర కార్యదర్శి రియల్ టైమ్ నాగరాజు యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, కొత్తపేట మున్నా, కటారి సురేష్, కృష్ణ కాంత్ రెడ్డి, ఎం గిరీష్, సంజు, కొత్తకోట మోహన్, రీఫింజయుడు,కడుమురు షఫీ, అరుణ్ తదితరులు పాల్గోన్నారు.

About Author