NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రానున్న ఎన్నికల్లో…విజయం తథ్యం

1 min read

కర్నూలు పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

పల్లెవెలుగు వెబ్, ఓర్వకల్: జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం ఓర్వకల్  ఎయిర్ పోర్ట్ వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు రాక్ గార్డెన్ ఆవరణలో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లాను తన హయాంలో ఇండస్ట్రియల్ హబ్, ఎయిర్పోర్ట్ , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసినట్టు యువతకు ఉపాధి అవకాశాలు కల్పన ధ్యేయంగా అభివృద్ధి పథంలో నడిపినట్టు తెలిపారు. అమరావతి రాజధానిని కాదని మూడు ముక్కలాట ఆడుతున్నారని సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా  ఉండదని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో భూములను విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ధారదత్తం చేస్తున్నాడని కొండలను గుట్టలను ఆక్రమించేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వైసీపీ పాలనను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు   ఈ కార్యక్రమంలో పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి  టీడీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు అనంతరం కల్లూరు మండలం మార్కాపురం గ్రామం లో నకిలీ విత్తనాల కారణం గా దిగుబడి కోల్పోయిన పత్తి పంటలను పరిశీలించిన నారా  చంద్రబాబు. ప్రభుత్వం పత్తి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

About Author