PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరభద్ర ఆలయంలో.. నాగులచవితి

1 min read

పల్లెవెలుగువెబ్​, రాయచోటి: రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత వీరభద్రాలయంలో గురువారం నాగుల చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మంజుల ఆధ్వర్యంలో ప్రధానార్చకులు శంకరయ్య కృష్ణయ్య లు వీరభద్ర స్వామి,భద్రకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నాగుల పుట్ట వద్ద పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి నాగులకు,చవితి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అలాగే పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలువురు మహిళా భక్తులు వీరభద్ర ఆలయానికి వచ్చి నాగుల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలోవేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author