వివేకా హత్య కేసులో.. సీబీఐ విచారణకు జగన్ మేనమామ !
1 min read
పల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 90 వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణకు జగన్ మేనమామ, వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. వివేకా హత్య తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి విచారణకు హాజరుకావడం ఇదే మొదటిసారి. దీంతో సీబీఐ విచారణ ఆసక్తికరంగా మారింది. ఇంకా ఎవరెవర్ని విచారిస్తారన్న ఆసక్తి నెలకొంది. రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.