NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దీన‌మైన స్థితిలో జ‌ర్నలిస్టులు.. జ‌గ‌న్ ఆదుకోవాలి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీలో జ‌ర్నలిస్టులు దీన‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నార‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు ఆవేద‌న వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. ప్రభుత్వంపై జ‌ర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార‌ని అన్నారు. అక్రిడేష‌న్ కార్డు జారీ, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు జారీ విష‌యంలో సమ‌స్యలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల‌ని కోరారు. జ‌ర్నలిస్టుల‌ను త‌క్ష‌ణ‌మే ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా గుర్తించాల‌ని డిమాండ్ చేశారు. న‌వ ప్రభుత్వ క‌ర్తవ్యాల పేరు ప్రభుత్వానికి వ‌రుస లేఖ‌లు రాస్తున్న ర‌ఘురామకృష్ణరాజు … 9 లేఖ రాశారు. ఈ లేఖ‌లో జ‌ర్నలిస్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల పై ముఖ్యమంత్రికి వివ‌రంగా రాశారు.

About Author