NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుపాడు గ్రామంలో గడపకు గడపకు మన ప్రభుత్వం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : శుక్రవారం నాడు మండల పరిధిలోని తిరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు జగనన్న సంక్షేమ పథకాలు అందిన వివరాలను లబ్ధిదారులకు వివరిస్తూ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా లబ్ధిదారులకు హామీ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని వైసిపి ప్రభుత్వం వచ్చాక అందరికీ నవరత్నాలు అంటూ కడుపులో బిడ్డనుండి వృద్ధాప్యంలో వచ్చేవరకు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలలో మళ్లీ జగనన్నను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. శివరాంరెడ్డి. రఘు మాధవరెడ్డి. ఇసాని సునీల్ కుమార్ రెడ్డి. ఎల్లారెడ్డి ఎంపీడీవో మల్లీశ్వరప్ప. తాసిల్దార్ శ్రీనివాసులు. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు.

About Author