NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్రిబుల్​ ఐటీలో… ‘ఏక్​ తారీఖ్​..ఏక్​ ఘంటా..’

1 min read

IIITDM కర్నూలు క్యాంపస్‌లో శ్రమదానం చేసిన విద్యార్థులు, ప్రొఫెసర్లు

పల్లెవెలుగు, కర్నూలు:IIITDM కర్నూలులోని అక్టోబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్వచ్ఛతా హి సేవా 2023 కింద జాతీయ “ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా” కార్యక్రమం జరుపబడింది. IIITDM కర్నూలు క్యాంపస్‌లో మరియు సమీప ప్రాంగణాల్లో క్లీన్లీనెస్ డ్రైవ్ (శ్రమదాన్) నిర్వహించబడింది. గౌరవ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.వి.ఎల్.ఎన్.సోమయాజులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛత కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 1000 సంవత్సరాల నాటి చారిత్రక ప్రదేశం- రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం, IIITDM కర్నూల్ ప్రధాన ప్రవేశ ద్వారం మరియు IIITDM కర్నూల్ యొక్క అన్ని హాస్టల్ ప్రాంగణాలకు సమీపంలో ఈ సందర్భముగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు కర్నూలు (రి.) పాల్గొన్నారు. ఐఐఐటీడీఎం కర్నూలు అసోసియేట్ డీన్ (ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్) డాక్టర్ పీ రంగబాబు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

About Author