రెండు రోజుల్లో రూ. 4.73 లక్షల కోట్ల ఆదాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : గడిచిన రెండురోజుల్లో సెన్సెక్స్ సూచీ 1105 పాయింట్లు దూసుకెళ్లడంతో బీఎస్‌ఈలో రూ.4.73 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒకటిన్నర శాతం రాణించడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.42 లక్షలు పెరిగి రూ.255.39 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో పాటు అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో సోమవారం స్టాక్ సూచీలు నెల రోజుల గరిష్టంపై ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఐటీ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 760 పాయింట్లు బలపడి 54,521 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 16,250 స్థాయిపైన 16,279 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు.