PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండు గంటల్లో.. ‘కోవిడ్’​ నిర్ధారణ

1 min read
కోవిడ్​ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్​ శ్రీనివాసులు

కోవిడ్​ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్​ శ్రీనివాసులు

– ట్రూనాట్ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
పల్లెవెలుగు వెబ్​, చిట్వేల్​: రైల్వేకోడూరు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటుచేసిన ట్రూనాట్ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు కోరారు. ఇక్కడ కోవిడ్ పరీక్షలు చేయించుకున్న రెండు గంటల్లో ఫలితాలు వస్తాయన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి రోగులకు వైద్య సేవలు అందించాలని లేకపోతే భవిష్యత్తులో నమ్మకం కోల్పోతారన్నారు. రైల్వేకోడూరులో కోవిడ్ సేవలు అందిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్, సి హెచ్ సి, ట్రూ నాట్ పరీక్షా కేంద్రం, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని విప్ కొరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ట్రూ నాట్​ కోవిడ్​ పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేసిన కలెక్టర్​ హరికిరణ్​కు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, హేమన వర్మ, రమేష్, నాగేంద్ర, సర్పంచ్ శివయ్య, మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author