NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండేళ్లలో.. సంక్షేమం.. అభివృద్ధి విప్లవం

1 min read

– రాయచోటి మున్సిపల్​ చైర్మన్​ ఫయాజ్​ బాష
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ విప్లవం తెచ్చారని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి రెడ్డి లు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పిలుపుమేరకు రాయచోటి పార్టీ కార్యాలయ ఆవరణంలో కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సిపి నాయకులతో కలసి చైర్మన్, వైస్ చైర్మన్ లు పార్టీ జెండాను ఎగురవేసి,కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలన ఆదర్శంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా జరుగుతోందన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నా యన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా,వైఎస్ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, జిన్నా షరీఫ్, కౌన్సిలర్లు ఫయాజుర్ రెహమాన్, మదన మోహన్ రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాషా, జాకీర్, ఫయాజ్ అహమ్మద్, షబ్బీర్, గౌస్ ఖాన్, సుగవాసి శ్యామ్, ఈశ్వర్ ప్రసాద్, రమేష్, రవీంద్ర యాదవ్, గువ్వల బుజ్జిబాబు, వ్రియాజ్, అన్నా సలీం, రామాంజులు, ఇర్ఫాన్, వైఎస్ఆర్ సిపి నాయకులు నవరంగ్ నిస్సార్, కొత్తిమీర ప్రసాద్, జావీద్,తబ్రేజ్, అమీర్ , కొత్తపల్లె ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author