PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేంపెంటలో… ‘అమీలియో’ ఉచిత వైద్యశిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కర్నూలు నగరంలోని అమీలియో ఆస్పత్రి యాజమాన్యం నేతృత్వంలో ఆదివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.  కర్నూలు నగరానికి చెందిన అమీలియో హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో వైద్యులు యశోధ (అసిస్టెంట్‌ గైనిక్‌), అబ్దుల్ రహేమాన్ (అసిస్టెంట్‌ జనరల్‌ మెడిసిన్‌), ఆప్తోల్మాలజీ రవికుమార్‌, లక్ష్మణ్‌, అల్తమాస్‌, వీరేష్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటిచూపు, షుగర్‌, బీపీ, ఈసీజీ, తదితర పరీక్షలు చేసి అవసరం మేరకు ఉచితంగా మందులు, కరోనా నేపథ్యంలో ఉచిత మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మేనేజర్​ కె. రమేష్​ మాట్లాడుతూ… వైద్యులు దైవంతో సమానమని, అమీలియో ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్యశిబిరంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలవాసుల ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా  ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా మేనేజర్​ కె. రమేష్​ పిలుపునిచ్చారు. అనంతరం అమీలియో వరప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలకోసం జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామల పెద్దలు తమను సంప్రదించవచ్చునని ఆ గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. సెల్‌ 9951923623. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,అమీలియో సిబ్బంది పాల్గొన్నారు.

‘అమీలియో’ సేవలు… అభినందనీయం.. : వేంపెంట వాసులు

కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రజల వద్దకు వచ్చి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్న  అమీలియో ఆస్పత్రి ఎం.డి., ప్రముఖ వైద్యులు లక్ష్మీ ప్రసాద్​ చాపె సేవలు అభినందనీయమన్నారు పాములపాడు మండలం వేంపెంట గ్రామస్తులు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మెగా ఉచిత శిబిరాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.  బడుగుబలహీన వర్గాలు, పేదలు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న అమీలియో ఆస్పత్రి ఎండి లక్ష్మీ ప్రసాద్​ చాపెకు రుణపడి ఉంటామన్నారు.

About Author