పేషంట్ల రద్దీ దృష్ట్యా.. మరో రెండు O.P కౌంటర్లు ప్రారంభం
1 min read– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో నూతన ఓపి కౌంటర్లను ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ… కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతన ఓపి కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.ఆసుపత్రి లోని పేషంట్ల రద్దీ దృష్ట్యా అదనంగా మరో రెండు O.P కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.ప్రతి పేషంట్స్ ఆరోగ్యంపై ఆన్లైన్లో నమోదు ఈ ఆసుపత్రి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ యాప్ వినియోగంపై నోడల్ అధికారి డా.శివబాల అవగాహన కల్పించలని తెలియజేశారు.ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్స్ కు అభ యాప్ (ABHA) ద్వారా వాళ్ళ ఐడి నెంబర్ ద్వారా ఈజీగా డిజిటల్ హెల్త్ ఐడీ నెంబరు చెబితే ఒపి మరియు ఐపి ప్రాసెస్ తొందరగా పూర్తయితుందని తెలియజేశారు.ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ వారి ఆధార్ కార్డు మరియు ఆభ ఐడి హెల్త్ కార్డు కంపల్సరిగా తీసుకురావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమనలిని, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.సునీల్ ప్రశాంత్, మరియు ఆసుపత్రి ఏడి, శ్రీ.రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, గారు తెలిపారు.