నిరుద్యోగులు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : డిసెంబర్ నెల నిరుద్యోగం డేటా విడుదలయింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగం నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. నవంబరులో 7.0శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు గత నెలలో 7.9 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో గరిష్ఠంగా 8.3 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలు ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడానికి కారణమైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం, తెలంగాణలో 2.2 శాతం నిరుద్యోగిత నమోదైంది. అత్యధికంగా హరియాణాలో 34.1 శాతం నిరుద్యోగ రేటు రికార్డయ్యింది. అత్యల్ప నిరుద్యోగ రేటు కర్ణాటకలో 1.4 శాతంగా ఉంది.