PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగులో… సరికొత్త సీరియల్ నిండు నూరేళ్ల సావాసం

1 min read

– ఆగస్ట్ 14 నుంచి సోమవారం-శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడంలో తిరుగులేని ఛానల్ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్ తో ఆకట్టుకుంటున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్తో మీ ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించడంలో ముందుండే జీ తెలుగు సరికొత్త కథనాలు, ఆలోచింపజేసే ఇతివృత్తాలతో ఆసక్తికర మలుపులతో సాగే సీరియల్స్ని అందిస్తూ అలరిస్తోంది. వినోదాన్ని రెట్టింపు చేసేందుకు మరో ఆసక్తికరమైన కథతో సాగే సీరియల్తో మీ ముందుకు రానుంది. ఓ సైనికుడి జీవితంలో ఊహించని మలుపులతో సాగే కథ నిండు నూరేళ్ల సావాసం’, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో!ఇండియన్ ఆర్మీ మేజర్ అమరేంద్ర వర్మ (రిచర్డ్ జోస్), అతని నలుగురు పిల్లల చుట్టూ సాగే కథ ‘నిండు నూరెళ్ల సావాసం’. అతని భార్య అరుంధతి (పల్లవి గౌడ) మరణం తరువాత మేజర్ అమర్ ఒంటరివాడైపోతాడు. పిల్లలతో సహా కొడైకెనాల్ నుండి సికింద్రాబాదుకు చేరిన అమర్, స్నేహితురాలు మనోహరి (మహేశ్వరి) సాయంతో పిల్లల్ని చూసుకుంటాడు. కానీ అరుంధతి మాత్రం తన పిల్లల్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి మనోహరి కాదని నమ్ముతుంది. అందుకే ఆత్మగా ఆ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని కనిపెట్టుకుంటుంది.అమర్ జీవితంలోకి ఊహించని విధంగా వచ్చి చేరుతుంది RJ భాగమతి (నిసర్గ గౌడ). తన పిల్లలను చూసుకోవడానికి భాగమతే సరైన వ్యక్తి అని అరుధంతి ఎందుకు నమ్ముతుంది? భాగమతి పిల్లలకి ఎలా దగ్గరవుతుంది? భర్త పిల్లలకు కనిపించని అరుంధతి ఆత్మ భాగమతికి మాత్రమే ఎందుకు కనిపిస్తుందో తెలియాలంటే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ని ప్రతిరోజు తప్పకుండా చూడాల్సిందే.అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘నిండు నూరెళ్ల సావాసం’ తప్పకుండా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. తల్లిదండ్రులు లేదా భాగస్వామిని కోల్పోవడం వల్ల ఎదుర్కొనే బాధ, బాధ్యతలు, అవధుల్లేని తల్లిప్రేమ… వంటి భావోద్వేగ అంశాలతో అల్లుకున్న ఈ కథ తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది.జీ తెలుగు సూపర్హీట్ సీరియల్ పసుపు కుంకుమ’ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి పల్లవి గౌడ. చిన్న గ్యాప్ తరువాత ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్న పల్లవి మాట్లాడుతూ, ‘ జీ తెలుగులో ‘నిండు నూరెళ్ల సావాసం’ అనే కొత్త సీరియల్ ద్వారా మరోసారి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు, ఇందులో నా పాత్ర ఇంతకముందు నేను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నిజానికి తెలుగు బుల్లితెరపై ఇంతవరకు ఇలాంటి పాత్రను ఎవరూ పోషించలేదు. ఎప్పటిలానే తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్కి కూడా తమ ప్రేమ, మద్దతు అందిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.ఆగస్టు 14th నిండు నూరేళ్ల సావాసం ప్రారంభంతో రాధమ్మ కూతురు కొత్త ప్రసార సమయంసోమా- శని సా 6:00 గం మరియు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రసారం 6:30 ని సోమా శనిఆకట్టుకునే కథతో రానున్న సరికొత్త సీరియల్ నిండు నూరేళ్ల సావాసం, ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం, సోమవారం-శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, మీ అభిమాన ఛానల్ జీ తెలుగులో!

About Author