PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌డ్జిల‌పై అనుచిత వ్యాఖ్యలు.. వైకాపా నేతల పాత్ర .. ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సుప్రీం కోర్టు, హైకోర్టు జ‌డ్జిల‌పై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. శ‌నివారం పి. ఆద‌ర్శ, ఎల్. సాంబ‌శివారెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ ను అరెస్టు చేసింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజ‌శేఖర రెడ్డి కువైట్ నుంచి వ‌స్తుండ‌గా సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటి వ‌ర‌కు 16 మందిపై కేసులు న‌మోదు చేసిన‌ట్టు సీబీఐ తెలిపింది. ఈ కేసులో వైకాపా కు చెందిన ఎంపీ నందిగం సురేష్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహ‌న్ ప్రమేయం పై కూడ ద‌ర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నట్టు.. ఐదుగురిని అరెస్టు చేసిన‌ట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాత్రల‌పై విచార‌ణ జ‌రుగుతోంద‌ని, విచార‌ణ పూర్తయ్యాక వారిపై కూడ లీగ‌ల్ చ‌ర్యలు తీసుకుంటామ‌ని సీబీఐ అధికారులు వెల్లడించారు.

About Author