PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యా శాఖ మంత్రి  చే ఆప్టా డైరీ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నేడు విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ  క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) 2024 డైరీ ఆవిష్కరణ చేయటం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని మొన్న చర్చల సందర్భంగా చెప్పిన విధంగా చెల్లింపులు జరుపుతారు అని తెలియ చేశారు. ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు 98 ఏం టి ఎస్ గా అప్పాయింట్మెంట్ అయిన టీచర్స్ జీతాల చెల్లింపు జరగ లేదని మంత్రి  తో చెప్పగా వెంటనే అధికారులతో మాట్లాడి చెల్లింపులు చేయమని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు 98ఎం టి ఎస్ వారిని రెగ్యులర్ చెయ్యమని కోరగా ఆ విషయం పరిశీలన లో వుందని చెప్పారు. తదనంతరం సెక్రటేరియట్ లో పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ని ఆప్టా నాయకులు కలిసి పలు ఉపాధ్యాయ సమస్యల ను ఆయన దృష్టికి తేవడం జరిగింది. వారు త్వరలోనే వాటిని పరిష్కారం చేస్తామని ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో గుర్తింపు వున్న సంఘాలు అన్నిటి తో తాను ప్రత్యేక సమావేశం ను ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు.పాఠశాల విద్యా శాఖ కమీషనర్ శ్రీ సురేష్ కుమార్కి ఆప్టా డైరీ మరియు ఉపాధ్యాయ సమస్యల పై వినతి అంద  చేయటం జరిగింది. ఆప్టా నాయకత్వం పాఠశాల విద్యా శాఖ అదనపు కార్యదర్శి శ్రీ భాస్కర్ ని,ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవనందారెడ్డి ని, ఎస్ సి ఈ అర్ టి డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి ని, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీమతి పార్వతి ని , శ్రీ రవీంద్రా రెడ్డి ని, జాయింట్ డైరెక్టర్ శ్రీ మువ్వా రామలింగం ని, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని, గుంటూరు కృష్ణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యం ల్. సి శ్రీమతి కల్పలత ని కలవటం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆప్టా రాష్ర్ట అధ్యక్షుడు గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్, విజయ నగరం జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి నారాయణా రావు నెల్లూర్ జిల్లా అధ్యక్షుడు డేవిడ్ మరియు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివరాం రామారావు  మొదలైన నాయకులు పాల్గొన్నారు.

About Author