గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం… సిసి రోడ్లు ప్రారంభోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: బిల్కల గూడూరు గ్రామంలో. దాదాపు కోటి రూపాయల పైచిలుకు నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ గ్రామంలో రెండు సిసి రోడ్లను ఆదివారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వసతులు సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో గ్రామ గ్రామాన గ్రామ సచివాలయాలు రైతులకు ఆర్ బి కే విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు చేశామని అభివృద్ధి పథంలో గ్రామాలను నడిపించామని నవరత్నాల లబ్ధిని ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా అందేలా చూసామని దళారి వ్యవస్థ లేకుండా చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని వచ్చే ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం మళ్లీ ఏర్పడబోతుందని మెరుగైన ప్రభుత్వ పథకాలను మేనిఫెస్టోలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారని తెలిపారు అనంతరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలోఎంపీపీ నాగమద్దమ్మ జెడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి.సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. ఎల్లారెడ్డి. శిరుప శ్రీనివాసరెడ్డి. శ్రీకాంత్ రెడ్డి.సయ్యద్ భాష .షారూఖ్.. మండల వైసీపీ అధ్యక్షుడు శివరామిరెడ్డి.. రఘు మాధవరెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి. మేఘనాథ్ రెడ్డి. ఆనంద్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి బండపల్లి రమేష్. పుల్లయ్య. నంద్యాల వెంకటేశ్వర్లు. బాల్ చెన్ని. వైసిపి మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.