NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణేష్ సదన్ ప్రారంభోత్సవం…

1 min read

– చైర్మన్, చక్రపాణి రెడ్డి, పదిమందికి పైగా ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులకు ఆలయ ఈవో లవన్నస్వాగతం పలికారు అనంతరం స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు, పూజఅనంతరం ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు మంత్రి దంపతుల స్వీకరించారు. దర్శనానంతరం,శ్రీశైలంలో నూతనంగా 220 వసతి సముదాయo ప్రారంభించిన మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైలం ఈవో లవన్న , శ్రీశైలం వచ్చే భక్తులకు వసతి సముదాయాలు  దొరకక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని భక్తులకు మెరుగైన వసతి కల్పించాలని ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీశైలంలో   నూతనంగా 220 రూములను ప్రారంభించామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు, అయితే మరోవైపు ఈ వసతి సముదాయాన్ని ప్రారంభోత్సవానికి ముహూర్తాలు సరైనవి లేవని శ్రీశైల దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తన లేఖలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టుసత్యనారాయణకు, కమిషనర్ కి, ఈవో లవన్నకు లేక రాసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది, అయితే ఈ వసతి సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైర్మన్, రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, పదిమందికి పైగా ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరు కాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది శ్రీశైలం ఈవో లవన్న మొండి వైఖరితో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ గణేష్ సదన్ ప్రారంభించారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మీడియాతో మాట్లాడుతూచంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై మాట్లాడుతూచట్టం ఎవరు చుట్టం కాదని అన్నారు న్యాయస్థానం మీద ప్రజల గౌరవం పెరుగుతుంది అన్నారు. జనసేన ఒంటరిగా వెళ్లే సత్తా లేదు కాబట్టే జనసేన టిడిపి పొత్తు వెళ్తున్నారని చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడని వ్యాఖ్యానించారు.

About Author