ఇండోర్ స్టేడియం నేడే ప్రారంభోత్సవం….
1 min read– ముఖ్య అతిథిగా మంత్రి ఆర్.కే. రోజా..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు టౌన్ మరియు పగిడ్యాల మండల కేంద్రంలో శాప్ ఆధ్వర్యంలో రూ.2.38 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాలను శనివారం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ది శాఖ మంత్రి ఆర్.కె రోజా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు నందికొట్కూరు లోని ఇండోర్ స్టేడియాన్ని మంత్రి రోజా ప్రారంబిస్తారు. అనంతరం పగిడ్యాల మండల కేంద్రంలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. మంత్రి రోజా నందికొట్కూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు నందికొట్కూరు పట్టణంలో కౌన్సిలర్ నాయబ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బీఎస్ ఆర్ యువత భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. పగిడ్యాల రోడ్డు లోని శాంతి దివేటర్ నుంచి ట్యాంక్ ఏరియా వరకు రోడ్డు కు ఇరువైపులా మంత్రి రోజా, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లెక్సీ లు ఏర్పాటు చేశారు. వివిధ మండలాల నుంచి దాదాపు మూడు వేల బైక్ లతో నందికొట్కూరు మార్కెట్ యార్డు నుంచి పగిడ్యాల రోడ్డు జీవన్ జ్యోతి సమీపంలోని ఇండోర్ స్టేడియం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
మంత్రి పర్యటన ఇలా…
ఉదయం 10:30 గంటలకు కర్నూలు నుండి బయలుదేరి నందికొట్కూరు కు చేరుకుంటారు. ఉదయం 11:30 గంటలకు నందికొట్కూరు మార్కేట్ యార్డ్ దగ్గర చేరుకుంటారు. అక్కడి నుండి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అభిమానులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గా నందికొట్కూరు ఇండోర్ స్టేడియం వద్దకు బయలుదేరుతారు.మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండోర్ స్టేడియం ప్రారంభోత్స కార్యక్రమం.1.00 గంటకు నందికొట్కూరు నుండి ర్యాలీగా పగిడ్యాలకు బయలుదేరుతారు.1:30 గంటలకు పగిడ్యాల గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు. 1:45 నిమిషాలకు పగిడ్యాల ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.00 గంటలకు పగిడ్యాల నుండి ముచ్చుమర్రి కి బయలుదేరుతారు.2:15 నిమిషాలకు ముచ్చుమర్రి గ్రామానికి ర్యాలీగా చేరుకుని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారి ఇంటికి చేరుకుంటారు.సాయంత్రం 3.00 గంటలకు ముచ్చుమర్రి గ్రామం నుండి తిరిగి కర్నూలకు బయలుదేరుతారు.
ఇక్కడి తో మంత్రి పర్యటన ముగుస్తుంది.
మంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం నందికొట్కూరు , పగిడ్యాలలో ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి , మిడుతూరు జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, పగిడ్యాల మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వ శివరామకృష్ణ రెడ్డి , యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి , జూపాడుబంగ్లా మిడ్తూరు మండల నాయకులు శివనాగి రెడ్డి , కన్వీనర్ నాగార్జున రెడ్డి , నంద్యాల జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్ , కర్నూలు జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ , కో ఆప్షన్ సభ్యులు కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి , ముచ్చుమర్రి ఎస్సై, వార్డు కౌన్సిలర్ లు,వైసీపీ నాయకులు ఉన్నారు.