PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ సంఘం క్యాలెండర్ల ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్: ఎమ్మిగనూరు పట్టణంలోని బీరలింగేశ్వర స్వామి కమ్యూనిటీ  హల్ లో శనివారం జిల్లా కురువ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి జిల్లాకురువ సంఘం ఉపాధ్యక్షులు కే టీ. ఉరుకుందు , మండల నాయకులు కే హంపయ్య ,కే .ఆంజనేయ , మాట్లాడుతూ ప్రభుత్వం గొర్రెల కాపరులను ఆదుకోవాలిని, భీమా సౌకర్యం కల్పంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కురువ సంఘం జిల్లా కార్యదర్శి గా ఎన్నికైన బోడబండ నరసింహులును పూలమాలతో సన్మానించారు.

కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి కే .దివాకర్ ,నగర కోశాధికారి కే .వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు నాయకులు ల్యాబ్ భీరప్ప, డాక్టర్ సత్యన్న, బోడబండ నాయకులు శంకర్, శ్రీరాములు, ఈదన్న, హనుమంతు, రాము, లక్సమన్న పాల్గొన్నారు.

About Author