గుండ్ల సింగవరం గ్రామంలో పాలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం
1 min read– అవుకు మండలం వైఎస్ఆర్సిపి కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామంలో :ఈనెల 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో నియోజకవర్గంలోని అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామపంచాయతీ పరిధిలోని జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందని అవుకు మండలం వైయస్సార్సీపి కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్ల సింగవరం గ్రామం పరిధిలోని నూతనంగా నిర్మాణం చేపట్టిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, మండల ప్రాథమిక పాఠశాల భవనం, రెండు అంగనవాడి భవనాలు, సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణం తో పాటు దాదాపు 2 కోట్ల 60 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బనగానపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ భూపాల్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, కాటసాని ప్రసాద్ రెడ్డి, చల్లా సూర్య ప్రకాశ్ రెడ్డి, చల్లా రాజశేఖర్ రెడ్డి అవుకు మండలం జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి, యువ నాయకులు గుండ్ల సింగవరం సర్పంచ్ కాటసాని రమాకాంతరెడ్డి ,కాటసాని రమా వెంకటేశ్వర్ రెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి, ఎంపీటీసీ పార్వతమ్మ తదితరులు హాజరవుతున్నారని అవుకు మండలం వైయస్ఆర్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి తెలిపారు. నేడు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండి బ్రహ్మానందరెడ్డి,మీరాపురం ప్రతాపరెడ్డి, ఎం నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు,