ఎస్ టి యు నూతన భవనం ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : చాగలమర్రిలోని రిక్వెస్ట్ బస్టాప్ వద్ద నూతనంగా నిర్మించిన ఎస్టియు ఉపాధ్యాయ సంఘం భవనాన్ని ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మండల అధ్యక్షుడు వీరభద్రుడు, చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ షేక్ సోహెల్ లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన సభలో ఎస్టియు మండల శాఖ అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి షేక్ బాబూలాల్, ఉపసర్పంచ్ షేక్ సోహెల్ , మండల అధ్యక్షుడు వీరభద్రుడు ఎంతగానో సహకరించాలని కృతజ్ఞతలు తెలిపారు . ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బాబూలాల్ వీరభద్రుడు సోహెల్ లు హామీ ఇచ్చారు. విద్యార్థులను చక్కని దేశ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం అన్నారు . సమాజంలో ఉపాధ్యాయ సేవలు ప్రశంసనీయం అన్నారు . సభలో ముగ్గురు నాయకులను, ఎంఈఓ లు అనురాధ, న్యామతుల్లాలను ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మండలం నుండి ఇతర మండలాలకు బదిలీ అయినా ఉపాధ్యాయులు ఎస్ శ్రీనివాసులు, అబ్దుల్ ఖాదర్ తదితర ఉపాధ్యాయులను స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటయ్య, చింతలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి లను కూడా వీరు ఘనంగా సత్కరించారు . కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్ టి యు జిల్లా కార్యదర్శి జయరాజ్, జిల్లా కౌన్సిలర్లు శివశంకర్ , ప్రసాద్, రాష్ట్ర మీడియా కన్వీనర్ నాగేంద్ర కుమార్, మండల ఆర్థిక కార్యదర్శి సుబ్బారావు సంఘ నాయకులు నరసింహులు , అంబటి రాజశేఖర్ రెడ్డి, శేషాద్రి, మస్తాన్, ఉస్మాన్, ముల్లా మహబూబ్ బాషా , పెట్టిన కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సుధాకర్ గుప్తా , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముల్లా జాబిర్ , ఎంపీటీసీ ఫయాజ్ , వార్డు సభ్యులు బ్రాందీన్, పెయింటర్ షరీఫ్, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ముల్లా ఖాదర్బాషా, షేక్ షబ్బీర్, మదర్ వలి, రంగయ్య, గిరి రాజా తదితరులు పాల్గొన్నారు.