NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివరాత్రి మహోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

1 min read

– ఎమ్మెల్యే దూలo నాగేశ్వరావు
పల్లెవెలుగు వెబ్ కైకలూరు : కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్) మంగళవారం ఉదయం కొల్లేటి శ్రీ శ్రీ శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మరియు రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోకర్ణేశ్వర స్వామి వారి దేవస్థాన శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని వేయబడిన గోడపత్రికలను స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు,గోకర్ణేశ్వరస్వామి వారి దేవస్థాన పాలకమండలి చైర్మన్ చింతా సాయిబాబు, దేవస్థానాల ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరరావు, దేవస్థానాల ట్రస్ట్ బోర్డు నెంబర్లు ఉడిముడి సుబ్బరాజు,మద్దాల సుబ్బలక్ష్మి ,ఇంటి ఇందిరమ్మ,బలే సారంగధర,రెండు దేవస్థానాల అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author