శ్రీ మూల పెద్దమ్మ జాతర గోడపత్రిక ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ మూల పెద్దమ్మ ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే అమ్మ వారి జాతర గోడపత్రికను గురువారం నాడు ఆలయ ఆవరణలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి ఆలయ చైర్మన్ చిన్నన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు సందర్భంగా ఆలయ ఈవో సీతా మోహన్ మాట్లాడుతూ ఉగాది పర్వదినం ముగిసిన మరుసటి రోజు మూల పెద్దమ్మ జాతర మహోత్సవం మొదలవుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు ఈనెల 23వ తేదీ అమ్మవారికి ఆకు పూజ కుంకుమార్చన పూజలు నిర్వహిస్తామని సాయంత్రం 6:00 నుండి బోనం కుండలతో అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు రాత్రి భాస్కర్ ఈవెంట్స్ వారిచే సినీ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 24వ తేదీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుండు పందాలు బైక్స్ లో పందెం మరియు తాడు లాగు పోటీలు నిర్వహిస్తామని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త కేశవరావు ఎం ఆంజనేయులు నాగేంద్ర. దేశం నాగేశ్వర్ రెడ్డి వాల్మీకి సేవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.