PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సామాజిక సంఘసంస్కర్తల విగ్రహాల ఆవిష్కరణ..

1 min read

ఘనంగా సామాజిక సంఘసంస్కర్తలు బహుజనుల ఆరాధ్య దైవాలు మహాత్మ జ్యోతిరావుపూలే సావిత్రిబాయిపూలే ఫాతిమా షేక్ డా “బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ

సావిత్రిబాయి పూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక  అద్వర్యంలో కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురం గ్రామం నందలి మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నందు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిభాపూలే, సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమాషేక్ ల విగ్రహాల దాత బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు  గ్రామ సర్పంచు నయోమి, బిసి జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషఫణి, BAMCEF ప్రతినిధులు డాక్టర్ హరిప్రసాద్, ఇంటలెక్చువల్ కలెక్టివ్, ఉపాధ్యాయులు ఖధీరుల్ల, ఇనయతుల్లా, సుంకన్న , మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ, మైనార్టీ నాయకులు అన్వర్ హుస్సేన్, ఇక్బాల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాదామియా పాల్గొన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్, అంబేద్కర్ ల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి, నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రిబాయి పూలే, జ్యోతిబాపూలే ల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని వారు తెలిపారు. చదువుల తల్లి సావిత్రిబాయిపూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావుపూలే అని, మహిళలను విద్యా వంతులుగా తీర్చిదిద్దేందుకు తన భార్య ను ఉపాధ్యాయురాలు గా తీర్చిన ఘనత పూలేదేనని వారు కొనియాడారు. జ్యోతిభాపూలే ని గురువులుగా ప్రకటించుకొని డాక్టర్ బి.అర్. అంబేద్కర్ గారు విద్య, రిజర్వేషన్లు, మరియు మహిళల హక్కులకు సంబంధించిన అన్నింటిని రాజ్యాంగంలో పొందుపరిచారని వారు తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరపాలని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే జయంతి రోజును జనవరి 3 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం BAMCEF డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని పిలువు నిచ్చారు. నాడు వారు ఏ యే సమస్యలపై పోరాడారో నేడు అవే సమస్యలు కొత్త రూపంలో వస్తున్నాయని వాటన్నింటిపై చదువుతూ పోరాడాలని వారు పిలుపు నిచ్చారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుని ఆ స్ఫూర్తితో ప్రతి బహుజన బిడ్డ మరియు విద్యార్థులు ముందుకు వెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భారతమ్మ, ఈరమ్మ , కటికె భాను, హుస్సేన్ బీ, దస్తగిరమ్మ, ఈశ్వరమ్మ,కమ్మరి లక్ష్మీదేవి  తదితరులు పాల్గొన్నారు.

About Author