నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం
1 min readరైతు భరోసా కేంద్రం,సీ.సీ రోడ్లు లను ప్రారంభించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో 86 లక్షల 80,000 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం, పలు సిసి రోడ్లను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గులదుర్తి గ్రామ ప్రజలు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం ముప్పై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం 21 లక్షల 80 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు, పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మరో సి.సి రోడ్డులను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రావరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో బనగానపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు కేవలం గొల్లదుర్తి గ్రామంలో 86 లక్షల 80 వేల రూపాయలతో నూతనంగా రెండు భవనాలను, సిసి రోడ్లను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అలాగే బనగానపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి ప్రజలు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అందువల్లనే ఈరోజు బనగానపల్లె నియోజకవర్గ ని అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లడానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. నిత్యం ప్రజల కోసం పరితపించే మన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు చేపట్టి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న నాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని అధికారం చేపట్టిన తర్వాత పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అలాంటి మన ముఖ్యమంత్రిని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి గా మళ్లీ మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ కర్ర గిరిజా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కరుణాకర్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా వికలాంగుల సంఘం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రిషికేశ్వర్ రెడ్డి బాలరాజు, సుబ్బారెడ్డి లతోపాటు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.