PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ పట్టణంలోని ఏసీబీ ఆఫీసులో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండరును డి.ఎస్.పి శివ నారాయణస్వామి గారు ఆవిష్కరించడం జరిగింది. యూక్ రాయలసీమ అడ్వైజర్ వేణుగోపాల్ గారు సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి గారు మాట్లాడుతూ యాక్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి , యువతకు ,ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఎక్కడైనా అవినీతి అధికారులు ఉంటే మాకు సమాచారం ఇవ్వవలసిందిగా తెలియజేశారు. అవినీతి నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ బి నారాయణ మరియు కర్నూలు జిల్లా సెక్రెటరీ పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author