PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ హెల్త్ క్లినిక్,రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం

1 min read

– గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక్క వైయస్ జగన్ గారితోనే సాధ్యం..ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో.కోవెలకుంట్ల మండలం చిన్న కొప్పేర్ల గ్రామం లో 39 లక్షల 30 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ మరియు రైతు భరోసా కేంద్రాలను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులుకాటసానిరామిరెడ్డిప్రారంభిం చారు.గ్రామానికి చేరుకొన్న ఎమ్మెల్యేకాటసానిరామిరెడ్డి గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.గ్రామం లో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం వైయస్సార్ హెల్త్ క్లినిక్,రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక్క మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యం అని చెప్పారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు శాశ్వత అభివృద్ధి వైపు కూడా అడుగులు వేయడం జరిగింది అని సంక్షేమం – అభివృద్ధి రెండు రెండు కళ్ళు లాంటివి అని చెప్పారు.పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను సీఎం వైయస్ జగన్ గారు తీసుకురావడం జరిగింది అని చెప్పారు.అలాగే రైతు ల.సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు,విత్తనాలను అందించడం జరుగుతుంది అని చెప్పారు.నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ లభిస్తాయి అని చెప్పారు.ఈ కార్యక్రమం లో ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్రా గిరిజా రెడ్డి,మండల కన్వీనర్ భిమిరెడ్డీ ప్రతాప్ రెడ్డి, కోవెలకుంట్ల పట్టణ ఉప సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, APNGO’S రాష్ట్ర ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి ,ఎంపీటీసీ కత్తి సురేష్ బాబు, గ్రామ సర్పంచ్ చిట్రేడ్డి విజయ లక్ష్మి, చిట్రెడ్డి . మోహన్ రెడ్డి,రఘునాథ రెడ్డి,వెంకట రమణ రెడ్డి,హరినాథ్ రెడ్డి, వైయస్సార్ పార్టీనాయకులు, కార్యకర్తలు, మండల తహశీల్దార్ పుష్ప కుమారి, ఎంపిడిఓ మహమ్మద్ దౌల,వైద్యసిబ్బంది,వ్యవసాయశాఖసిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.

గ్రామ స్వరాజ్యం, అభివృద్ధి, సీఎం, ఎంపీటీసీ,

About Author