PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం ప్రారంభోత్సవం

1 min read

– 16.93 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం మరియు ప్రయోగశాల నూతన భవనంను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 

– భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం

– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : కర్నూలు నగరంలోని లేబర్ కాలనీ(రోడ్ నంబర్ 2, వెంకటరమణ కాలనీ సమీపంలో) 16.93 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం మరియు ప్రయోగశాల నూతన భవనంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.మంగళవారం కర్నూలు నగరంలోని లేబర్ కాలనీ(రోడ్ నంబర్ 2, వెంకటరమణ కాలనీ సమీపంలో) నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం మరియు ప్రయోగశాల నూతన భవనంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ  బ్రహ్మానంద రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కర్నూలు నగరపాలక సంస్థ కర్నూలు నగరంలోని లేబర్ కాలనీ(రోడ్ నంబర్ 2, వెంకటరమణ కాలనీ సమీపంలో) 1213 చదరపు గజాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి కేటాయించగా,  ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSPHCL) వారి పర్యవేక్షణలో సొంత నిధులను సమకూర్చుకుని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ద వహించి మార్పులు తీసుకుని వచ్చారని అన్నారు. భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణ లో భాగంగా చర్యలు చేపట్టడం జరుగుతోందని , ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలు  పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నదని, వాటిలో ఆధునిక టెక్నాలజీ అమలుతో కాలుష్యం తక్కువగా ఉండేలా చూడాలని, ఆ విధంగా పని చేసేలా కాలుష్య నియంత్రణ మండలి రెడ్, ఆరంజ్, గ్రీన్ కేటగిరీ వారీగా  చర్యలు చేపడుతోందని అన్నారు. నియమాలు అధిగమిస్తే వెంటనే చర్యలు చేపడుతున్నామని అన్నారు.  దేశం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు ఎంతో అవసరమని ఆ పరిశ్రమలలో కాలుష్యాన్ని నియంత్రించడం ముఖ్యమైన బాధ్యత అన్నారు. కర్నూలు పట్టణంలోని జోహారాపురం దగ్గర నగరంలోని మురుగు నీటిని శుభ్రపరిచి నదిలోనికి చేరవేయుటకు దాదాపు124 కోట్ల రూపాయలతో మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్టిపి) ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా ఉండటం కొరకు కర్నూలు నగరానికి సుంకేసుల నుండి 80 కోట్ల రూపాయలతో పైప్ లైన్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి అన్నారు.కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 2030 వ సంవత్సరం నాటికి కాలుష్య రహిత భారతదేశంగా తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశం డబ్ల్యూహెచ్ఓ రెకమండేషన్ కంటే పదిరెట్లు పొల్యూషన్ ఎక్కువగా ఉన్నదని నియంత్రయించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుండి అధిక శాతంలో కాలుష్యం రాకుండా చూసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ అనేది అన్ని శాఖల సహకారంతో సాధించగలమని తెలిపారు. పట్టణాలలోని సాలిడ్ వేస్ట్ నుండి  ఎనర్జీని తయారు చేసుకో వచ్చుచున్నారు. ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం ఉందన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం మరియు ప్రయోగశాల భవనాన్ని  నిర్మించుకోవడం చాలా సంతోషం అన్నారు.కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజలకు భరోసా, రక్షణ కల్పించే దిశగా బోర్డు పనిచేయాలన్నారు.పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి వారు పరిశ్రమలకు ఇచ్చే పొల్యూషన్ సర్టిఫికెట్స్ నియమ నిబంధనలతో నడుపుతున్న పరిశ్రమలకే సర్టిఫికెట్స్ ఇవ్వాలని, చిన్న చిన్న పరిశ్రమల వారు పొల్యూషన్ సర్టిఫికెట్ కొరకు వచ్చినప్పుడు నియమ నిబంధనలతో ఉన్నట్లయితే ఆలస్యము చేయకుండా త్వరితగతిన పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలియజేశారు. నదీ పరివాహక ప్రాంతాలలో పరిశ్రమల కాలుష్యాన్ని నదిలోకి వదిలే వారిని గమనించి వారిపై చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ బోర్డ్ వారిని కోరారు.కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి క్లీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్ పై దృష్టి సారించారన్నారు.   రైతులకు సాగునీరు, త్రాగునీరు కలుషితము కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉందన్నారు. కర్నూల్ నగరంలోని  నది జలాలలో మురుగునీరు కలవకుండ ఎస్టిపి ప్లాంట్ ద్వారా శుభ్రపరిచి నదిలో కలిపే ప్రక్రియను కూడా చేపడుతున్నామన్నారు.నగర మేయర్ బి. వై. రామయ్య మాట్లాడుతూ  కర్నూలు నగరాన్ని  కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నగరమును కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ద్వారా చెత్త సేకరణ చేసి డంపు యార్డ్ లకు తరలించడం జరుగుతుందన్నారు. నగరంలో మంచి వాతావరణం నెలకొల్పడానికి దాదాపుగా 70 వేల మొక్కలను నాటడం జరిగిందన్నారు. నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా కూడా చేసే దిశగా నగరపాలక సంస్థ కృషి చేస్తుందన్నారు.సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఏపీఐఐసీ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.గోవిందరాజు,జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కెవి రావు,సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజశేఖర్, ఈఈ ముని ప్రసాద్, సిబ్బంది గణేష్, వివిధ పారిశ్రామిక ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author