కురువ విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
1 min read– కర్నూలు జిల్లా కురువ సంఘం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘము ఆద్వర్యం లో జిల్లా లోని ప్రతిభావంతులైన కురువ విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు ,గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న లు పేర్కొన్నారు .శుక్రవారం నగరంలోని సంఘం కార్యాలయం లో సమావేశం జరిగింది .సమావేశంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ 2022-23 విద్యాసంవత్సరంలో జిల్లా లో పది ,ఇంటర్ రెండవ సంవత్సరములో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల చివరి వారంలో బహుమతులు ఇస్తామన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ అర్హులైన ప్రతిభావంతులు ఈ నెల 18 వ తేదీ లోగ 9032741194,9440756199 నెంబర్ లకు Watsup ద్వారా మార్కుల జాబితా నకలు మరియు కుల సర్టిఫికెట్ నకలును పంపాలని సూచించారు .ఈ సమావేశంలో జిల్లా నాయకులు,కత్తి శంకర్ తిమ్మాపురం ఉరుకుందు. బి .సి .తిరుపాల్ , తవుడు శ్రీనివాసులు,బి .రామకృష్ణ బి .బాలరాజు ,కే దివాకర్ ,పెద్దపాడు హరిదాసు,ధనుంజయ ,బీచుపల్లి ,ఓ .పుల్లన్న ,దేవేంద్ర ,బూదురు లక్ష్మన్న. బిఎన్ టాకిస్ వేంకటేశ్వర్లు. కుంటనహాలు సర్పంచ్ శివరాం ,హనుమంతు ,బురుజుల పక్కీరప్ప ,కురువ శివ ,కురువ భాస్కర్ ,కురువ బసప్ప.కే .సురేంద్ర ,మద్దిలేటి , బి .రామకృష్ణ ,బి .వెంకటేశ్వర్లు ,కే .నాగన్న తదితరులు పాల్గొన్నారు .