ఆగని వలసలు..తెదేపా గూటికి సర్పంచులు..
1 min read-కొత్తపల్లి మండలంలో వైకాపాకు సర్పంచ్ ల షాక్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎన్నికలు ముగిసినా కూడా తెలుగుదేశం పార్టీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు.నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ఇద్దరు ఆయా గ్రామాల సర్పంచులు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.కొత్తపల్లి మండలంవీరాపురం గ్రామ సర్పంచ్ సరస్వతి తో పాటు రామిరెడ్డి, కార్తీక్ రెడ్డి,చంద్రశేఖర్, రామగిరి,తిరుమల, వెంకటరమణ ఆచారి, రామకృష్ణ,వెంకటయ్య నాగేశ్వరరావు,రాజు, పాండురంగడు,ఎల్లన్న మరియు తదితర కుటుంబాలు అల్లూరు లోని మాండ్ర శివానందరెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు శివానందరెడ్డి సమక్షంలో వారు టిడిపిలో చేరారు.అదే విధంగా కొత్తపల్లి మండలంలోని మాజీ వైస్ ఎంపీపీ పోత సహదేవుడు ఆధ్వర్యంలో గువ్వలకుంట్ల గ్రామ సర్పంచ్ పూడిచెర్ల మాసమ్మ పార్టీలో చేరారు. వీరితోపాటు తదితర కుటుంబాలు పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యేను మరియు శివానంద రెడ్డి ని శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ కూడా ఆధైర్య పడవద్దని అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటామని అంతేకాకుండా గ్రామాల్లో అవసరమైన పనులన్నీ కూడా అభివృద్ధి చేసుకుందామని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఐదింటికి సంతకాలు చేశారని డీఎస్సీ మరియు ల్యాండ్ టైట్లింగ్ పింఛన్ల పెంపు తదితర వాటిపై సంతకాలు చేశారని ఇవన్నీ గర్వించదగ్గ విషయమని వారు కార్యకర్తలతో అన్నారు.