PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళిత సంక్షేమ పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చండి

1 min read

కెవిపిఎస్ గిత్తరి రమేష్ బాబు డిమాండు 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: దళితుల సంక్షేమ పథకాలు పాలక పక్షాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తరి రమేష్ బాబు డిమాండ్ చేశారు.బుధవారము పత్రికా విలేకరుల సమావేశంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తరి రమేష్ బాబు  మాట్లాడుతూ,దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షత, అంటరానితనం, అస్పృశ్యతలను నిలువరించి, సమ సమాజ స్థాపన లక్ష్యంగా… సామాజిక, ఆర్థిక, రాజకీయ అణచివేతకు గురవుతున్న సామాజిక తరగతులకు అండగా, అణచివేతపై ధిక్కార స్వరంగా తాము నిలుస్తున్నామని ఆయన అన్నారు. భూమి లేక, భుక్తి లేక, శక్తి లేక, యుక్తి లేక, విముక్తి పొందలేక వెట్టి చాకిరితో ఆధిపత్య వర్గాల పెత్తనం కింద మగ్గిపోతున్నా కూడా… ఈ పాలకులు ఈ దుర్మార్గమైన అంటరానితనాన్ని రూపుమాపడం కోసం మరియు దౌర్జన్యాలను నియంత్రించడం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడం శోచనీయం అని అన్నారు.కెవిపిఎస్ నిర్వహించిన పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ప్రతి దళిత పేటకు రెండు ఎకరాల స్మశాన స్థలం, డప్పు కళాకారులకు, చర్మకారులకు పెన్షన్, గుర్తింపు కార్డులు, డప్పు, గజ్జలు, డ్రెస్సు, చర్మకారుల పనిముట్లు లాంటివి సాధించామని చెప్పుకొచ్చారు. డప్పు చర్మకారుల పెన్షన్ రూ. 3000/-  నుండి రూ. 6000/- లకి పెంచాలని, రెండు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇల్లు నిర్మాణాన్ని పూర్తిచేసి ఇవ్వాలని, దళితులు ఆత్మగౌరవంగా బతికేందుకై రెండు ఎకరాల భూమి కేటాయించాలని,కాటికాపురులను కనీసం మనుషులుగా గుర్తించాలని కోరారు. బసివినుల విముక్తి కోసం కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు.పాలకులు మారుతున్నారు తప్ప, దళితుల తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు.

About Author