అశేష హిందూ సమాజాన్ని వీహెచ్పి (సభ్యులు)గా చేర్చండి
1 min read– విశ్వహిందూపరిషత్ రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు
పల్లెవెలుగు ,వెబ్ కర్నూలు: మూడు సం.ల కు ఒకసారి నిర్వహించే విశ్వహిందూ పరిషత్ ” హితచింతక్ అభియాన్” సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని అందుకోసం కర్నూలు జిల్లా లోని అన్ని గ్రామాల్లో,నగర కేంద్రాల్లోని బస్తీల్లో నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ రెండురోజుల ” శిక్షణా కార్యక్రమం” ముగింపు సభలో పిలుపునిచ్చారు.ఇంకా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని అన్ని రెవెన్యూ మండల కేంద్రాలను యూనిట్ గా చేసుకుని గ్రామ గ్రామాన ఈ హితచింతక్ అభియాన్(విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు) కార్యక్రమం నిర్వహించాలన్నారు,మరో ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ ఈ రెండు రోజుల శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన కార్యకర్తలందరూ తమతమ కార్యక్షేత్రాలలో వెళ్ళి పరిషత్ కార్యాన్ని విస్తరించాలనీ,ఇక్కడ నేర్చుకున్న వివిధ విషయాలను గుర్తుంచుకునిరాబోయే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలనితెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్,విభాగ్ ధర్మప్రసార్ కన్వీనర్ విజయుడు,సేవా కన్వీనర్ గురుమూర్తి,జిల్లా అధ్యక్షులు గోరంట్లరమణ,ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, వాసుదేవయ్య,కార్యదర్శిమాళిగిభానుప్రకాష్,కోశాధికారి అయోధ్య శ్రీనివాసరెడ్డి,సంఘటనా కార్యదర్శి భూపాలాచారి, నగర అధ్యక్షులు పి.సీ.మద్దిలేటి, ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ, కార్యదర్శి ఈపూరి నాగరాజు,శేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.