NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపిలోకి చేరిక‌లు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని జొహ‌రాపురం ఇందిర‌మ్మ కాల‌నీ, పాల‌కొట్టాలు, గ‌రీబ్ న‌గ‌ర్, అశోక్ న‌గ‌ర్, బాబూజీ న‌గ‌ర్ ప్రాంతాల‌కు చెందిన ప‌లువురు యువ‌కులు, మ‌హిళ‌లు తెలుగుదేశం పార్టీలో చేరారు. మౌర్య ఇన్‌లో టిడిపి క‌ర్నూలు అసెంబ్లీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో వీరు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్ర‌భుత్వం వ‌స్తే యువ‌త‌కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. స‌రైన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే బాధ్య‌త యువ‌త‌పై ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ చెప్పి పార్టీకి ఓటు వేసే విధంగా యువ‌త కష్ట‌ప‌డాల‌ని సూచించారు. హెచ్.డి.ఆర్ యూత్ శివ ప్ర‌సాద్, విజ‌య‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో వెంక‌టాద్రి, కొండారెడ్డి, క‌ళాధ‌ర్, ర‌ఘుసింగ్, రాము, కిర‌ణ్‌, రెహ‌మాబి, ష‌బానా, చైత‌న్య‌, క‌ళ్యాణ్‌, ఆదినారాయ‌ణ‌, ఉరుకుందులు పార్టీలో చేరారు.

About Author