వైద్య వృత్తిపై అవగాహన పెంచుకోండి..
1 min readనూతన వైద్యవిద్యార్థులకు సూచించిన డా. నరేంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్: వైద్యవిద్యార్థులు వైద్యవృత్తి..విధులు..బాధ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి. మంగళవారం కర్నూలు వైద్య కళాశాల న్యూ లెక్చరర్ గ్యాలరీ నందు నూతన వైద్యుల (MBBS, 2022 Beach) పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వైద్య వృత్తి ప్రాముఖ్యత, బాధ్యత మరియు వైద్యుల విధుల గురించి తెలిపారు. నూతన వైద్య విద్యార్థులకు శుభాకాక్షలు తెలియజేశారు. డాక్టర్ YSR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సూచనల ప్రకారం, మొదటి MBBS విద్యార్థులకు (కొత్తగా చేరిన ఫ్రెషర్లు) తరగతులు 15/11/2022 నుండి ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు పేరెంట్స్ మీట్ నిర్వహించబడింది మరియు అన్ని సూపర్ స్పెషాలిటీల ప్రొఫెసర్ మరియు హెచ్‌ఓడీలు పాల్గోన్నారు. అనంతరం కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ .. ఫ్రెషర్లను ఉద్దేశించి కర్నూలు వైద్య కళాశాల చరిత్ర, ప్రాముఖ్యత, విద్యావేత్తలు, ర్యాగింగ్‌పై తీసుకున్న చర్యల గురించి ప్రిన్సిపాల్ వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడిలు తమ అధ్యాపకులను పరిచయం చేశారు మరియు వారి సబ్జెక్ట్ స్పెషాలిటీ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల, అడిషనల్ డీఎంఈ & ప్రిన్సిపాల్, డా.సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డా.సాయి సుధీర్, డా.శ్రీహరి, డా.చిట్టినరసమ్మ, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ , డా.శివబల నగంజన్, డా.కిరణ్, మరియు వైద్య అధ్యాపకులు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.