ఏపీలో కర్ఫ్యూ సమయం పెంపు
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పై అధికారుల సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కర్ఫ్యూ ముగియనుండటంతో .. ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సడలింపు సమయం కూడ పెంచింది. గతంలో పగటి పూట 12 గంటల వరకే జనసంచారానికి అనుమతి ఉండేది. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు జనసంచారానికి అనుమతి ఉంటుంది. ఈనెల 10వ తేది వరకు 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. 11వ తేది నుంచి 2 గంటల వరకు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు అనుమతి ఉంటుంది.