ఉద్యోగుల బీమా అర్హత వయసు పెంపు
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర ఉద్యోగులు బీమా చేసే అర్హత వయసును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 53 ఏళ్ల అర్హత వయసును 56 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు కొత్త పేరివిజన్ ప్రకారం వేతనాలు పెరిగాయి. పెరిగిన వేతనాలు, పదవీ విరమణ వయసు ప్రాతిపదికన ఉద్యోగుల బీమా అర్హత వయసును, చెల్లించాల్సిన ప్రీమియంను పెంచింది. 21 సంవత్సరాల నుంచి 53 ఏళ్ల వయసున్న వారికే ఈ ప్రభుత్వ పాలసీ తీసుకునే అర్హత ఉండేది. 21 ఏళ్ల నుంచి 19 ఏళ్లకు తగ్గించి, గరిష్ఠ వయసును 53 ఏళ్ల నుంచి 56 ఏళ్లకు పెంచింది.