PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇవాళ్టితో గడువు ముగియాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ నెల(మే) 26వ తేదీ వరకు తుది గడువు ఉంటుందని తెలిపింది. పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్‌ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

                                    

About Author