ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను పెంచండి
1 min read– పిడి రామచంద్రారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గ్రామాలలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్యను పెంచాలని మండల వ్యాప్తంగా రోజు ఐదువేల కూలీలు టార్గెట్ గా ఉంటే మొత్తం 1500 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని సంఖ్యను పెంచకపోతే చర్యలు ఉంటాయని శుక్రవారం నాడు ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి మండలంలోని గ్రామాలలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు గ్రామాలలో ఉపాధి లేక ప్రజలు వలస వెళ్తున్నారని వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్పంచ్ ఏపీవో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని ఆదేశించారు జిల్లా విభజన జరిగాక నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచే టార్గెట్ లో మండలం వెనుకబడి ఉందని కచ్చితంగా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోతే ఎలా అని ఉపాధి హామీ సిబ్బందిని నిలదీశారు పనితీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు మూడు గ్రామాలలో సర్పంచులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు సరైన సంబంధాలు లేవని తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ నియమావళికి లోబడి పని చేయాలని వేసవికాలం దృష్టిలో పెట్టుకొని కూలీలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్ల దేనని ఈ సందర్భంగా తెలియజేశారు.