NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెంచిన విద్యుత్ చార్జ్ లు తగ్గించాలి

1 min read

– తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కౌతాళ: మండలంలోని కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జ్ లు తగ్గాలంటే తుగ్లక్ పాలన నడుపుతున్న జగన్ మోహన్ రెడ్డి దిగిపోవాలని తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం వారు తెలుగు దేశం పార్టీ ఆదేశాలు మేరకు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డెని, తెలుగు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొట్రెష్ గౌడ్ ఆధ్వర్యంలో కౌతాళం మండలంలోని కరెంట్ ఆఫీసు దగ్గర పెంచిన విద్యుత్ చార్జ్ లు తగ్గించాలని, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంఘం జిల్లా నాయకులు కౌతాళం టిడిపి టౌన్ అధ్యక్షులు కాశి విశ్వనాధ్ డెని, టిప్పు సుల్తాన్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుడి శివమూర్తి, డా. రాజానంద్, బాపురం వెంకటరెడ్డి,దొడ్డనగౌడ్, యస్సి సెల్ జిల్లా కార్యదర్శి రాజబాబు,ఉరుకుంద సురేంద్ర, చిరుతపల్లి శివప్ప గౌడ్,మైనారిటీ జిల్లా కార్యదర్శి రహిమాన్,ఏరిగేరి బసవరాజు,కామవరం నబి, యస్సి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఎ‌ సి వీరేష్,ఉమేష్ గౌడ్, రామచంద్ర, నరసప్ప, ఈరన్న, డేవిడ్ రమేష్, రౌడూర్ ఈరన్న, చుడి సురేష్, మల్లేష్, ఐటీడీపి మంజునాథ్, చెన్నకేశవ మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author