పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి.. సిపిఐ
1 min read– నాలుగు స్తంభాల మండపం దగ్గర ధర్నా చేస్తున్న సిపిఐ నాయకులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాస్ లు డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ ధరలపెంపును నిరసిస్తూ స్థానిక సిపిఐ కార్యాలయం నుండి వినూత్న రీతిలో గ్యాస్ సిలిండర్ ను పాడే పై పెట్టి పట్టణ పురవీధుల గుండా ఊరేగించి నాలుగు స్తంభాల మండపం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య ప్రజలపై పెనుబారం పడే విధంగా మోడీ సర్కార్ వంట గ్యాస్ ధరలను అంతకంతకు పెంచుకుంటూ పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వంట గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలకు పెంచడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్.రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్, కారన్న, తిమ్మయ్య, ఏఐటియుసి తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నెట్టికంటయ్య, రంగన్న, నాయకులు ఎం.కే.సుంకన్న, మాదన్న, రామచంద్ర, పెద్ద ముని, ఓబులేసు, శ్రీనివాసులు, పులి, ఉచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.