కరోన తర్వాత సైక్లింగ్ కు పెరిగిన ప్రాధాన్యం
1 min readపల్లెవెలుగువెబ్ : కరోనా అనంతర కాలంలో నగరవాసుల జీవనశైలి పూర్తిగా మారింది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకు సైక్లింగ్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. నగరంలో సైక్లింగ్ ట్రాక్‌లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వీటిని విస్తరించే యోచనలో ఉంది. కరోనా అనంతర కాలంలో సైకిళ్ల అమ్మకాలు పెరిగాయని పలు సైకిల్ షాప్‌ల యజమానులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యం కోసమే కాకుండా పర్యావరణ హితంగానూ సైక్లింగ్ ఉంటుందని కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. సైకిల్‌పై ఆఫీస్‌లకు వెళ్లడానికి ఉన్న అవకాశాలనూ అన్వేషిస్తున్నారు. కరోనా విజృంభణ తగ్గినా దాని తీవ్రత కలవరపెడుతున్న వేళ పబ్లిక్ ప్రాంగణాల వినియోగం వీలైనంతగా తగ్గించుకోవడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం సైక్లింగ్ ఓ చక్కటి అవకాశమని అల్ఫా వెక్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బైసైకిల్ డివిజన్ సీఈఓ యోగేంద్ర ఎస్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.