ఆయుష్షు పెంచే దివ్య ఔషధం.. ‘నవ్వు’
1 min readఇంటర్నేషనల్ మిమిక్రి ఆర్టిస్ట్ జె. రమేష్
పల్లెవెలుగు:ఎన్నో సమస్యలతో సతమతమవుతూ… ఒత్తిడికి లోనవుతున్న మనిషి ఆయుష్షు పెంచే దివ్య ఔషధం… ఒక్క నవ్వు మాత్రమేనన్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ మిమిక్రి ఆర్టిస్ట్ జె.రమేష్. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మిమిక్రి ఆర్టిస్ట్ జె. రమేష్ మాట్లాడారు. నవ్వు ఆరోగ్య సూత్రాలలో ప్రథమం. ఆధునిక ప్రపంచంలో వ్యక్తుల మధ్య స్నేహభావం… ప్రేమ… అప్యాయత..అనే బంధాలు తగ్గిపోయాయని, మనుషుల ఆలోచన తీరు మార్పు వచ్చిందన్నారు. ఇటువంటి ప్రపంచంలో వ్యక్తి తమను తాము మార్చుకోడానికి.. ప్రపంచాన్ని శాంతియుతంగా …సానుకూలంగా మార్చడానికి అవసరమైన శక్తివంతమైన భావోద్వేగం నవ్వు ఒక్కటే.. అని పేర్కొన్నారు. నవ్వు అనేది ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలపై, వారి భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా మిమిక్రి ఆర్టిస్ట్ జె. రమేష్ వెల్లడించారు.
కర్నూలు ప్రజల ఆత్మబంధువు.. డా. చంద్రశేఖర్:
కర్నూలు నగర ప్రజల ఆత్మబంధువు డా. చంద్రశేఖర్ అని… ఆయన పేరు చెప్పగానే ప్రజలు ఎంతో గౌరవంతో తనతో మాట్లాడారన్నారు ఇంటర్నేషనల్ మిమిక్రి ఆర్టిస్ట్ జె. రమేష్. ఇప్పటివరకు అమెరికాలో 25 సార్లు ప్రపంచ నవ్వుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నానని… కర్నూలులో కూడా 20 సార్లు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను నవ్వింపజేశానన్నారు. ప్రతిఒక్కరు నవ్వుతూ ఉండటమే తన జీవిత ఆకాంక్ష అన్నారు.
నవ్వడం..యోగం:
అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. హాస్యం మన సమస్యల్ని దూరం చేస్తుందని… హాయిగా గాఢమైన నిద్రస్తుందన్నారు. రోగాలకు దూరంగా ఉంటూ… జీవితం కాలం పెంచుతుందన్నారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ మిమిక్రి ఆర్టిస్ట్ జె.రమేష్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్కూర చంద్రశేఖర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.