PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ పాదయాత్రకు పెరుగుతున్న ప్రజాధరణ

1 min read

– లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయితేనే వైసీపీ నేతలు పాయింట్లు తడుస్తున్నాయి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయితేనే వైసీపీ నేతల పాయింట్లు తడుస్తున్నాయని,జగన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు కాకి దుస్తులు వదిలి ఖైదీ దుస్తులు ధరించక తప్పదని . బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాధరణ చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ కి ఓటమి భయంతో చెమటలు పడుతున్నాయని అన్నారు. ఆ భయంతోనే జగన్ కొందరు అధికారులు పోలీసుల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న 8వ రోజు పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే విద్యుత్ నిలిపివేసి,అన్ని అనుమతులు ఉన్న సరే మూడు వాహనాలు సీజ్ చేసి,బహిరంగ సభ జరగకుండా ఆపేసారని అన్నారు.అదేవిధంగా డిఎస్పి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు యువగళం వాలంటీర్లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఎస్ఐ కానిస్టేబుల్ లో ఒకరికి కూడా నేమ్ బ్యాడ్జ్ లేకుండా,పలమనేరు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి గజేంద్ర అనే యువగలం వాలంటరీపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు అతను ఆసుపత్రిలో చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు పాదయాత్ర పోలీసులు అడ్డుకొని నానా రచ్చ చేసి మా కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి మా కార్యకర్తల పైనే అత్యాయత్నం కేసులు పెట్టి నిబంధనలు ఉల్లంగించారాని అన్నారు.లోకేష్ తో పాటు అమర్నాథ్ రెడ్డి పులిపర్తి నాని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తదితర నేతలపై 353,290, 188, 341 ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మా కార్యకర్తలపై దాడి చేసి వారిపైనే హత్యాయత్నం కేసులు పాదయాత్రకు పోలీసులు భంగం కలిగించి తిరిగి తమ విధులకు భంగం కలిగించారంటూ మా నేతలపై కేసు పెట్టారంటే ఎంత దుర్మార్గ చర్య అని అన్నారు. నిన్న జరిగిన ఘటనన్నిటికీ ప్రధాన కారణం డీఎస్పీ సుధాకర్ రెడ్డి. అసలు పోలీసులు ఇంతలా అధికార పార్టీకి కట్టు బానిసల్లా ఏకపక్షంగా పనిచేయటం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని అన్నారు పాదయాత్రలో మైకు వాడొద్దనడం ప్రచార రథాలు ఎక్కువ వద్దనడం సిగ్గుచేటు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పాదయాత్రలో ఏమి ప్రచారం చేసావ్ నువ్వేమైనా చెట్లెక్కి ప్రచారం చేసావా నువ్వు మైకు వాడలేదా అని అన్నారు. నువ్వేమో ఎంచక్కా ఫ్యాన్ పట్టుకొని మరో చేత్తో మైకు పట్టుకుని ప్రజలకు అబద్దాలన్ని నూరిపోసావు. తిరుణాలలో రికార్డింగ్ డాన్స్ ప్రజల వద్దపెట్టినట్లునీపాదయాత్రలోడీజేబాక్సులు,కెమెరాలు, మైకులు పెట్టుకుని తిరిగి మమ్మల్ని మాత్రం స్పీకర్లు వాడొద్దంటారని విమర్శించారు.గతంలో జగన్ పాదయాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి పాదయాత్ర సజావుగా జరిగేలా చంద్రబాబు నాయుడు గారు సహకరించారా లేదా అని అడిగారు. నాడు చంద్రబాబు నాయుడు కూడా ఇలా వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర కాదు కదా కనీసం ఇంట్లో నుంచి తన పాదం కూడా బయట పెట్టేవాడు కాదు అని తీవ్రంగా మండిపడ్డారు.దేశంలో ఎంతోమంది నాయకులు పాదయాత్రలు చేశారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదని విమర్శించారు. 4000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయితే ఒక్కొక్కరు ఈ రాష్ట్రం విడిచి పారిపోయేటట్టు ఉన్నారు అని అన్నారు. వైసిపి నేతలకు ఎందుకు అంత భయం లోకేష్ ను చూస్తే ఎందుకు పాయింటు తడుపుకుంటున్నారు. జగన్ నువ్వేమో ప్రజల వద్దకు రావు వారి గోడు వినిపించుకోవు ప్రజల వద్దకు వెళ్లే ప్రతిపక్ష నేతలని పోలీసులతో అడ్డుకుంటావు ఇదేం రాజకీయం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని దిక్కరించి జగన్ రెడ్డికి వంత పాడుతున్న పోలీసులకు మేము ఒకటే చెబుతున్నాం రోజులన్నీ ఒకేలా ఉండవు తప్పులు చేస్తున్న పోలీసులు కాకి దుస్తులు వదిలి ఖైదీ దుస్తులు ధరించే రోజు తొందరలోనే ఉందని అన్నారు.నిన్న పాదయాత్రలో మా కార్యకర్తలపై దాడులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పాదయాత్ర ఇకనుంచి సజావుగా జరిగేలా చూడాలని డీజీపీకి కోరుతున్నామని డిమాండ్ చేసారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన సరే నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తాం అని అన్నారు.

About Author