NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాయ్ లాండ్ స్కూల్ లో స్వాతంత్ర్య వేడుకలు

1 min read

– ముఖ్య అతిథి గా విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనగర్ బి.గంగాధర్ 

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాయ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో (గ్లోబల్ డిస్కవరీ స్కూల్ ) 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరియాయి. ఈ కార్యక్రమానికి  గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనగర్ బి.గంగాధర్  గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు, మరియు జాయ్ ల్యాండ్ పాఠశాల గెస్ట్ హాఫ్ హానర్ గా గౌరవనీయులు డా. G. లతా లింకన్ గారు  ఫౌండర్ మరియు చైర్ పర్సన్ ఫెయిత్ వెల్ఫేర్ సొసైటీ, జాయ్ ల్యాండ్ పాఠశాల మరియు ప్రధానోపాధ్యాయులు అనిత గారు, సబీనా గారు, మేనేజర్ పవన్ కుమార్ గారు, సునీత గారు ఉపాధ్యాయుని  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల లో భాగంగా విద్యార్థులు పరేడ్ లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఎలక్షన్  కమిటీ ద్వారా ఎన్నికైన విద్యార్థులకు తగిన పథకాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా హాజరైనటువంటి అతిథులు మరియు పాఠశాల చైర్ పర్సన్, ప్రధానోపాధ్యాయులు స్వాతంత్ర దినోత్సవం గురించి మరియు విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు గురించి ఉపన్యాసం ఇచ్చి ప్రోత్సహించారు. విద్యార్థుల దేశభక్తి గీతాలతో, నృత్యాలతో పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి.

About Author