మదరాసాలో.. ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read– మువ్వ వెన్నెల జాతీయ జెండాను ఎగరవేసిన అధ్యక్షుడు ఎం ఏ రషీద్
– దేశం కోసం ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగఫలమే స్వతంత్రం
– పండగల జరుపుకున్న పంద్రాగస్టు వేడుకలు
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగ ఫలితమే పంద్రాగస్టు వేడుకలను దేశవ్యాప్తంగా పండుగలాగ నిర్వహించుకోవడం జరుగుతుందని *ఆత్మకూరు మదరాసా కమిటీ చైర్మన్ ఎం. ఏ. రషీద్ తెలిపారు* మంగళవారం పట్టణంలోని మదరాసా లో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి రెపరెపలాడే మువ్వ వెన్నెల జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎం ఏ రషీద్ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు దేశం కోసం స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణ త్యాగాలు అర్పించిన ఘనత ఉందని తెలియజేశారు దేశం కోసం నేటి యువతరం ముందుండాలని వివరించారు *ఈ కార్యక్రమంలో మదరసా (హెచ్ ఎం) మౌలానా ముర్తుజా టీచర్స్ జాకీర్ హుస్సేన్ రహంతుల్లా మౌలానా హఫీజ్ మజీద్ మరియు మదరాసా కమిటీ సభ్యులు కూరగాయల మాబు( ఏ.హెచ్. కె. వలి) సోఫీసా జాకీర్ హఫీజ్ సాహెబ్ కుదుష్ శాలి పైల్వాన్ తదితరులు పాల్గొన్నారు.